SRH నిర్ణయం బాధించింది.. డేవిడ్ వార్నర్ విమర్శలు

by  |
SRH నిర్ణయం బాధించింది.. డేవిడ్ వార్నర్ విమర్శలు
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021 ముగిసిన నెల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై డేవిడ్ వార్నర్ విమర్శలు చేశాడు. తాజా సీజన్‌లో సరైన ఫామ్‌లో లేకపోవడంతో కెప్టెన్సీని మాత్రమే కాకుండా తుది జట్టులో నుంచి తొలగించారు. అయితే టీ20 వరల్డ్ కప్‌లో చెలరేగి ఆడి మొత్తం 289 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఒక జాతీయ పత్రికతో మాట్లాడిన వార్నర్ తన మనసులోని బాధను తొలి సారిగా బయటపెట్టాడు. ‘ఎంతో ఇష్టపడి చాలా కాలంగా ఆడుతున్న జట్టు నుంచి ఎలాంటి కారణం లేకుండా తొలగించారు. కెప్టెన్సీని తప్పించడం నాకు చాలా బాధగా అనిపించింది. అసలు నాకు సమాచారం కూడా ఇవ్వలేదు. కానీ ఈ విషయాన్ని పెద్దది చేయాలని అనుకోవడం లేదు. నాకు ఇండియాలో చాలా మంది అభిమానులు ఉన్నారు. వాళ్లు నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. వాళ్ల కోసమే నేను ఇంకా ఆడుతున్నాను. నన్ను ఏ కారణంతో తొలగించారో తెలియదు, కానీ జట్టు కోసం చాలా కష్టపడ్డాను. రోజు ప్రాక్టీస్ చేశాను. అయితే సరైన సమయానికి పరుగులు చేయలేకపోయాను. అది ఏ క్రికెటర్‌కు అయినా ఎదురయ్యే సమస్యే. నాకింకా ఐపీఎల్‌లో మరిన్ని అవకాశాలు వస్తాయనే అనుకుంటున్నాను’ అని వార్నర్ చెప్పుకొచ్చాడు.


Next Story

Most Viewed