ఆ యువకులు బ్లడ్ డొనేట్ చేయండి.. ప్రాణాలు నిలపండి: వరంగల్ సీపీ

82

దిశ, కాళోజీ జంక్షన్: పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని హన్మకొండ జిల్లా హసన్‌పర్తి బాలాజీ గార్డెన్స్‌లో.. బుధవారం కాజీపేట పోలీస్ డివిజినల్ శాఖ ఆధ్వర్యంలో అర్బన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రక్తదాతలకు పండ్లు, సర్టిఫికెట్లు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం వల్ల మరొకరి ప్రాణాలను కాపాడిన వాళ్లం అవుతామని, ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కాజీపేట్ డివిజన్ పోలీస్ స్టేషన్స్ సిబ్బంది యువత రక్తదానం చేసినందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి, హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి.విజయచందర్ రెడ్డి, రెడ్ క్రాస్ రాష్ట్ర పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పొట్లపల్లి శ్రీనివాస్ రావు, కాజీపేట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్, హసన్‌పర్తి సీఐ శ్రీధర్ రావు, ధర్మసాగర్ సీఐ రమేష్, ఎలుకతుర్తి సీఐ శ్రీనివాస్, మడికొండ సీఐ రవి కుమార్, ఎస్‌‌ఐలు, పోలీస్ సిబ్బంది, యువత పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..