ఇకనైనా సక్కగుండండి.. లేకపోతే తాటా తీస్తాం: సీపీ తరుణ్ జోషి

by  |
tarun-joshi-1
X

దిశ, హన్మకొండ టౌన్: ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ రౌడీయిజం చేస్తే కఠిన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి.. రౌడీ షీటర్లను హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ట్రై సిటీ పరిధిలోని రౌడీ షీటర్లకు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని రుద్రమాదేవి ప్రాంగణంలో శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు.

tarun-2

ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ముందుగా రౌడీషీటర్ల ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ రౌడీషీటర్ల ప్రతి కదలికలపై పోలీసుల నిఘా వుంటుందన్నారు. ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు. ముఖ్యంగా సత్ప్రవర్తనతో జీవించేవారి పేర్లను రౌడీషీటర్ జాబితా నుంచి తొలగిస్తామని, ఇకనైనా కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని రౌడీ షీటర్లకు సూచించారు. కమిషనర్ వెంటా అదనపు డీసీపీ అడ్మిన్ వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఇన్స్ స్పెక్టర్లు శ్రీనివాస్, సంతోశ్, టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుళ్లు, సివిల్ కానిస్టేబుల్స్ ఉన్నారు.


Next Story

Most Viewed