కరోనా వేళ.. వాకింగ్ జాగ్రత్తలు

by  |
కరోనా వేళ.. వాకింగ్ జాగ్రత్తలు
X

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా వైరస్ ఉధృతి ఇంకా తగ్గలేదు. కేసులు రోజురోజుకూ అంతకంతకూ పెరుగిపోతున్నాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం ఎవరి జాగ్రత్తల్లో వాళ్లుండాలని మాత్రమే సూచిస్తున్నాయి. ఇప్పటికే అన్‌లాక్ 1.0 నడుస్తుండగా.. మరికొన్ని రోజుల్లో అన్‌లాక్ 2.0 కూడా రాబోతుంది. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే.. అప్పుడు ఇంకెలా ఉంటుందో ఊహిస్తేనే భయమేస్తుంది. ఏదేమైనా కరోనా వేళ.. ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటూ.. స్వీయ రక్షణే శ్రీరామరక్షగా అనుకోవాలి. ఇప్పటికైతే.. జిమ్‌లు ఓపెన్ చేయలేదు కానీ.. జూన్ 31 తర్వాత వాటికి కూడా పర్మిషన్ రావొచ్చు. ప్రస్తుతానికైతే.. సెలబ్రిటీల నుంచి కామన్ మ్యాన్ వరకు చాలామంది ఇంట్లోనే వ్యాయామాలు చేస్తున్నారు. మరి కొంతమంది జాగింగ్, వాకింగ్‌కు వెళ్తున్నారు. అయితే కరోనా విజృంభిస్తున్న టైమ్‌లో.. వాకింగ్‌కు వెళ్తున్న వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

మస్ట్ 12 ఫీట్స్..

మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్లు.. కనీసం 12 ఫీట్ల దూరం పాటించడం ఎంతో శ్రేయస్కరం. డ్రాప్‌లెట్స్ కారణంగా కరోనా వ్యాప్తి చెందుతుందని అందరికీ తెలిసిందే. అందుకోసం ఆరు ఫీట్ల దూరం పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. అయితే జాగింగ్ లేదా సైక్లింగ్ చేస్తున్నప్పుడు డ్రాప్ లెట్స్ మరింత దూరం, మరింత వేగంగా ప్రయాణిస్తాయని టెక్ కంపెనీ ‘అన్‌సిస్’ చేసిన సర్వేలో తేలింది. ఓ వ్యక్తి గంటకు 4 కిలోమీటర్ల వేగంతో జాగింగ్ చేస్తే.. అతని నుంచి వచ్చే డ్రాప్‌లెట్స్ దాదాపు 16 ఫీట్ల దూరం వరకు వెళ్లే అవకాశం ఉన్నట్లు అన్‌సిస్ తెలిపింది. గాలి, తేమలతో కూడిన పర్యావరణ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని ఆ కంపెనీ ఈ సర్వే జరిపింది. అందువల్ల జాగింగ్, సైక్లింగ్ చేసేటప్పుడు ఒకరికొకరు కనీసం 12 ఫీట్ల నుంచి 20 ఫీట్ల దూరం ఉండాలని సూచించింది.

చిన్న చిన్న ప్లేసుల్లో..

రన్నింగ్, వాకింగ్ చేసే ప్లేస్ చాలా విశాలంగా ఉండాలి. చిన్న చిన్న దారులను ఎంచుకోవద్దు. ఎందుకంటే.. మిగతా వాళ్లు మనకు చేరువలోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. అందులో ఎవరికీ కరోనా ఉన్నా.. అది వ్యాప్తి చెందే అవకాశం ఉండొచ్చు. అంతేకాదు చాలా తక్కువ మంది వచ్చే ప్రాంతాలకు మాత్రమే వాకింగ్‌కు వెళ్లడం ఉత్తమం.

మాస్క్ వేసుకోవద్దు..

వ్యాయామం చేస్తున్నప్పుడు మాస్క్ వేసుకోకపోవడం చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే.. వ్యాయామం చేసేటప్పుడు శ్వాస ఎక్కువగా పీల్చుకుంటాం. అలాంటి సమయాల్లో మాస్క్ ఉంటే.. ఇబ్బంది పడొచ్చు. బ్రీతింగ్ అంత సాఫీగా సాగదు. వైద్యులు కూడా 24 గంటలు మాస్క్ పెట్టుకోకూడదని హెచ్చరిస్తున్నారు. ప్రతి మూడు, నాలుగు నిమిషాలకోసారి మాస్క్ తీయాలని సూచిస్తున్నారు. చిన్నారులకైతే మాస్క్ వేయడం వల్ల బ్రీతింగ్ సరిగా తీసుకునే వీలుండదని ఇప్పటికే వైద్యులు చెప్పిన విషయం తెలిసిందే..

ఏవీ ముట్టుకోవద్దు..

వాకింగ్‌కు సహజంగా అవుట్‌డోర్‌కు వెళ్తుంటాం. కావున అక్కడున్న ఏ వస్తువులు గానీ, సర్ఫేస్ గానీ ముట్టుకోవద్దు. పార్క్ గేట్లు, లిఫ్ట్ బటన్స్, చెట్లు, మొక్కలు, బెంచీలు, గోడలు ఇలా ఏవైనా సరే ముట్టుకోకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పట్టుకోవాల్సి వచ్చినా, కూర్చున్నా.. శానిటైజ్ చేసుకోవాలి.

Next Story

Most Viewed