‘దాని మూలంగానే.. శారీరక సమస్యలు’

by  |
‘దాని మూలంగానే.. శారీరక సమస్యలు’
X

దిశ, హైదరాబాద్: కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు ఇంటి గడప దాటరాదని ప్రభుత్వం చేసిన హెచ్చరికతో ఇంటి వద్ద ఉండే వారు ‘‘డి’’ విటమిన్ లోపంతో బాధ పడుతున్నారు. రోజుల తరబడి నివాసాల నుంచి బయటకు రాని వారు, నలుపు రంగు చర్మం ఉన్న వారు, భూ మద్య రేఖకు దూరంగా చలి ప్రాంతాలలో నివాసముండే వారు, సన్ స్క్రీన్ లోషన్ అధికంగా వినియోగించే వారు దీని లోపంతో బాధ పడుతున్నారు. అంతేగాకుండా వీరికి అనేక రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. త్వరగా అలసి పోవడం, వెన్ను నొప్పి, మానసిక స్థితి లోపించడం, డిప్రెషన్‌కు లోనవడం, దెబ్బలు తగిలినప్పడు త్వరగా గాయాలు మానకపోవడం, శరీరంలో ఎముకలు చూడడానికి సాధారణంగా కన్పిస్తున్నప్పటికీ లోపలి భాగంలో పటుత్వం దెబ్బ తినడం, వెంట్రుకలు రాలడం, కండరాల నొప్పులు వంటివి దీని లోపంతో ఏర్పడతాయి. మానవ శరీరంలో విటమిన్ ‘‘డి’’ ది ప్రధాన పాత్ర. రోజూ కనీసం గంట పాటు సూర్య కిరణాలు శరీరాన్ని తాకాలి. చేపలు, పాలు ఆహారంలో తీసుకోవడం, వైద్యుల సూచనల మేరకు మందుల వినియోగం చేసే వారిలో ‘డి’ విటమిన్ లోపం ఏర్పడదు. అని డాక్టర్ రవిశంకర్ సూచించారు.

Next Story

Most Viewed