రేపటి నుంచి విశాఖపట్నం MP‌గా పనులు స్టార్ట్ చేస్తా: కేఏ పాల్

by Mahesh |
రేపటి నుంచి విశాఖపట్నం MP‌గా  పనులు స్టార్ట్ చేస్తా: కేఏ పాల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చాయంటే చాలు ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్ అక్కడ వాలిపోతారు. అలాంటిది తన సొంత రాష్ట్రంలో ఎన్నికలు జరగడంతో దాదాపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పాల్ అభ్యర్థులు పోటీలో నిలిచారు. కాగా ఈ ఎన్నికల్లో కేఎ పాల్.. విశాఖపట్నం పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలపై ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రజా శాంతి పార్టీకి మద్దతు తెలిపారని.. ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే వైజాగ్ ఎంపీ స్థానంలో మొత్తం 14 లక్షల ఓట్లు పోలయ్యయని ఎన్నికల సంఘం తెలిపిందని.. వాటితో తనకు 10 లక్షల ఓట్లు వేసి ప్రజలు తన వైపు నిలబడ్డాని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వైజాగ్ ఎంపీగా తానే గెలవబోతున్నానని... రేపటి నుంచి విశాఖపట్నం ఎంపీగా పనులు స్టార్ చేస్తానని.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed