కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం!.. త్వరలోనే ఆ రెండు కమీషన్లు ఏర్పాటు

by Ramesh Goud |
కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం!.. త్వరలోనే ఆ రెండు కమీషన్లు ఏర్పాటు
X

దిశ, డైనమిక్ బ్యూరో: త్వరలోనే విద్యా, వ్యవసాయ కమీషన్లు ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ పాఠశాలలో సెమీ రెసిడెన్సియల్ విధానాన్ని తీసుకువస్తామని, అనుభవజ్ఞుల సలహాల మేరకే ప్రజాపాలన సాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి రాణించిన విద్యార్ధులకు సన్మానం చేసేందుకు రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సహా విద్యాశాఖ అధికారులు హజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివి 10/10 స్కోరుతో టాపర్లుగా నిలిచిన విద్యార్ధులకు రేవంత్ రెడ్డి పురస్కారాలు అందించి, సన్మానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ వేడుకను ఏర్పాటు చేసిన వందేమాతరం ఫౌండేషన్ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న మీరు ఈ రకంగా రాణించడం ప్రభుత్వానికే గర్వకారణమని, ప్రైవేట్ స్కూల్స్ తో మా విద్యార్ధులు పోటీ పడగలుగుతున్నారంటే అది మాకు గుర్తింపు అని అన్నారు. ఎక్కడైనా నిధులు పెడితే ఖర్చు కావచ్చు కానీ విద్య మీద పెట్టిన నిధులు వృధా కాదని, పిల్లలు చదివి పెద్ద వాళ్లు అయ్యి పెట్టుబడులతో మళ్లీ మన సంపద మన దగ్గరకే లాభాలతో తిరిగి వస్తుందని నమ్ముతానని అన్నారు. త్వరలో విద్యా కమీషన్ ను అపాయింట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని, ప్రభుత్వ పాఠశాలలో తలెత్తే సమస్యలను పరిష్కారించడానికి విద్యా కమీషన్ నిరంతరం పని చేస్తుందని తెలపారు.

అలాగే దీనితో పాటు వ్యవసాయ కమీషన్ కూడా ఏర్పాటు చేస్తామని, ఈ కమీషన్ ద్వారా రైతుల సమస్యలు పరిష్కారించే దిశగా పని చేస్తామని, ఈ కమీషన్ల ద్వారా తెలంగాణ ను పునర్మించాలని నిర్ణయించుకున్నామని అన్నారు. అన్ని మాకు తెలుసని అనకుండా అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని పని చేస్తామని స్పష్టం చేశారు. అలాగే విద్యార్ధుల కోరిక మేరకు 10/10 వచ్చిన విద్యార్ధులకు ఫ్రీ అడ్మిషన్లు ఇవ్వాలని బుర్రా వెంకటేషం కు ఆదేశాలు ఇస్తున్నాననని అన్నారు. అంతేగాక మీరు ఇంటర్ లో కూడా రాణించి భవిష్యత్తులో డాక్లర్లు ఇంజనీర్లు కావాలని కోరుకుంటున్నానని, ప్రజలు సమస్యలు పరిష్కారించడానికి ప్రజా ప్రభుత్వం ముందుంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story