కరోనాపై యుద్ధం.. మేము సైతం సిద్ధమంటున్న విరుష్క జంట

by  |
కరోనాపై యుద్ధం.. మేము సైతం సిద్ధమంటున్న విరుష్క జంట
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా.. దేశాన్ని గడగడలాడిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి.. ఆసుపత్రిలో బెడ్లు ఫుల్.. శవాలతో స్మశానాలు ఫుల్.. దేశంలో ఆక్సిజన్ నిల్.. ఇది ప్రస్తుత దేశ పరిస్థితి. ఈ మహమ్మారి వలన అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఈ కరోనా మహమ్మారిని అంతం చేయడానికి అందరం కలిసి పోరాడాలని సెలబ్రెటీలు విన్నపాలు చేస్తున్నారు.. ఇంకొంతమంది స్టార్లు ఒక అడుగు ముందుకు వేసి ప్రజల కోసం విరాళాలను సేకరిస్తూ.. తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా విరుష్క జంట కూడా కరోనాపై యుద్ధం ప్రకటించింది. దేశంలో ప్రజల బాధలు చూసి తీవ్ర ఆవేదన కలిగిందని అన్న విరాట్‌ తన భార్య అనుష్క శర్మతో కలిసి తాను వైరస్‌పై పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇండియన్ ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌ కెట్టోతో కలిసి కొవిడ్ రిలీఫ్ ఫండ్ రైజింగ్‌కు ముందుకొచ్చారు. వారం రోజుల్లో రూ. 9 కోట్ల విరాళాలు సేకరించడమే లక్ష్యంగా #InThisTogether క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టిన విరుష్క దంపతులు.. రూ. 2 కోట్లు విరాళంగా అందించారు.

క‌రోనా రెండో ద‌శ విజృంభ‌ణ‌పై దేశం పోరాటం చేస్తుంది. ఈ స‌మ‌యంలో మా వంతుగా విరాళాలు సేక‌రించాల‌ని అనుకుంటున్నాం అని స్ప‌ష్టం చేశారు. దీనికి సంబందించిన ఒక వీడియోను విరాట్ పోస్ట్ చేశారు. “కరోనా సెకండ్ వేవ్ దేశంలో విజృంభించింది. ప్రజలను కాపాడడానికి వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్స్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతున్నారు. వారికి మనం అండగా ఉండాలి. అందుకే అనుష్క, నేను .. కెట్టోతో క‌లిసి ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్‌నుప్రారంభించాము. మీరిచ్చే ఒక్క రూపాయైనా ఎంతగానో ఉపయోగపడుతుంది. అందరం కలిసికట్టుగా ఉండి.. కరోనాను అంతమొందిద్దాం.. మా ఉద్యమంలో చేరాలని మీరందరినీ కోరుతున్నామని” విరుష్క తెలిపారు.

Next Story

Most Viewed