విశాఖకు అమాంతం పెరిగిపోయిన టికెట్స్ ధరలు.. కారణం ఇదే..!

by srinivas |
విశాఖకు అమాంతం పెరిగిపోయిన టికెట్స్ ధరలు.. కారణం ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఓటింగ్ కోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక పార్టీలు తామే అధికారంలోకి వస్తాయని వైసీపీ, టీడీపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ నేతలు అయితే ఒక అడుగు ముందుకేసి తమ పార్టీనే మళ్లీ అధికారంలోకి రాబోతోందని, జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెతున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఇప్పటి నుంచి విశాఖకు టికెట్లు బుకింగ్ చేసుకుంటున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి విశాఖ వెళ్లేందుకు జూన్ 8, 9వ తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బస్సులను బుక్ చేసుకుంటున్నారు. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ విశాఖకు టికెట్ రేట్స్ భారీగా పెంచేశాయి. గతంలో ఉన్న రేటు కంటే డబుల్ చేశాయి. దీంతో అదే రోజు విశాఖ వెళ్లాలనుకున్న సామాన్య జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గించాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed