కోలివుడ్‌కి కొత్త భామ ఎంట్రీ.. ఆమె ఎవరి కూతురంటే?

by  |
కోలివుడ్‌కి కొత్త భామ ఎంట్రీ.. ఆమె ఎవరి కూతురంటే?
X

దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ సూర్య ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు ప్రొడ్యూసర్‌గా సినిమాలు నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తమ్ముడు కార్తితోనూ ‘కడైకుత్తి సింగమ్(తెలుగులో చినబాబు)’ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సంగతి పక్కనబెడితే కార్తితో కలిసి తాజాగా మరో సినిమా అనౌన్స్ చేశాడు సూర్య. ‘విరుమన్’ టైటిల్‌తో తెరకెక్కనున్న సినిమాను ముత్తయ్య డైరెక్ట్ చేయనుండగా.. మావెరిక్ ఫిల్మ్ మేకర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది. ఈ మేరకు అదితి ఫస్ట్ లుక్ షేర్ చేసిన సూర్య.. హృదయపూర్వక సందేశంతో తనకు స్వాగతం పలికాడు. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటావని, ఆశీస్సులు అందించాడు.

ఇక ప్రౌడ్ ఫాదర్, గ్రేట్ డైరెక్టర్ శంకర్.. తన కూతురిని లాంచ్ చేయడం పట్ల సూర్య, జ్యోతిక దంపతులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. ‘ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్న అదితిని సినిమా లవర్స్ అందరూ ప్రేమతో ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను’ అంటూ ఈ చిత్ర హీరో కార్తి, డైరెక్టర్ ముత్తయ్యకు థాంక్స్ చెప్పాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది సెకండ్ మూవీ కాగా.. ప్రకాష్ రాజ్, రాజ్‌కిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న చిత్రం 2022 సమ్మర్‌లో రిలీజ్ కానుంది.

Next Story

Most Viewed