కరోనా ఫీవర్.. ప్రత్యేక విమానంలో యూఏఈకి కొహ్లీ

by  |
కరోనా ఫీవర్.. ప్రత్యేక విమానంలో యూఏఈకి కొహ్లీ
X

దిశ, స్పోర్ట్స్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal challengers bengalore) జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ (Virat kohli) ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌లో యూఏఈ (UAE) చేరుకున్నాడు. ఐపీఎల్‌(IPL) ఈ ఏడాది యూఏఈలో జరగనుండటంతో ఆర్సీబీ జట్టు శుక్రవారం ఒక విమానంలో బెంగళూరు నుంచి దుబాయ్ చేరుకుంది. అయితే కొవిడ్ భయాందోళన నేపథ్యంలో జట్టు సభ్యులందరితో కలసి ప్రయాణం చేయడానికి ఇష్టపడని విరాట్ కొహ్లీ ఒక చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకొని ముంబై నుంచి దుబాయ్ చేరుకున్నాడు.

యూఏఈ వెళ్లే ముందు ముంబైలోనే రెండుసార్లు కొవిడ్ పరీక్షలు(covid tests) చేయించుకుని ప్రత్యేక విమానంలో దుబాయ్ వెళ్లినట్లు కొహ్లీ మేనేజర్ (Kohli manager) మీడియాకు వెల్లడించారు. ఆయన బెంగళూరులో జట్టు సభ్యులతో కలవలేదని.. యూఏఈలోనే అందరితో కలసినట్లు ఆయన పేర్కొన్నాడు. కొహ్లీ దుబాయ్ చేరుకున్న వెంటనే ఆర్సీబీ యాజమాన్యం అతని ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆర్సీబీ జట్టు దుబాయ్‌లోని వాల్‌డార్ఫ్ హోటల్‌లో బస చేయనుంది. ఒక బ్లాక్ మొత్తం ఆర్సీబీ కోసమే యాజమాన్యం బుక్‌చేసి పెట్టింది. ఆ కారిడార్ మొత్తాన్ని బయోసెక్యూర్ చేయనున్నారు.



Next Story