కోహ్లీ ఎదుట రెండు రికార్డులు

by  |
కోహ్లీ ఎదుట రెండు రికార్డులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ముగించుకున్న టీమిండియా నేరుగా, ఆసీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్ భారత జట్టు మొదటిసారిగా అంతర్జాతీయ సిరీస్ ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎదుట రెండు రికార్డులు సవాల్‌గా నిలిచాయి. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 100 సెంచరీలు బాదిన ఆటగాడిగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించారు. ఆయన తర్వాత అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండోస్థానంలో ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్(71)తో రెండో స్థానంలో ఉన్నారు.

ఆ తర్వాత విరాట్ కోహ్లీ(70) సెంచరీలతో మూడోస్థానంలో ఉన్నారు. ఇప్పటివరకు వన్డేలో 43, టెస్టులో 27 శతకాలు చేసిన కోహ్లీ మొత్తం 70 సాధించాడు. అయితే ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ రెండు సంచరీలు సాధిస్తే.. రికీ పాంటింగ్‌ను వెనక్కి నెట్టి 72 సెంచురీలతో కోహ్లీ రెండో స్థానానికి ఎగబాకతాడు. అంతేగాకుండా ఈ పర్యటనలో కోహ్లీ ఒక్క సెంచరీ చేసినా… ఆసీస్ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా మరో రికార్డు సృష్టించిన వాడవుతాడు. కాగా ఈ రికార్డుల జాబితాలో కోహ్లీ, రోహిత్ 5 శతకాలతో ప్రస్తుతం సమానంగా ఉన్నారు. ఈ క్రమంలో కోహ్లీ ఏ రికార్డునైనా కొల్లగొడుతాడో లేదో వేచి చూడాలి.

Next Story

Most Viewed