మేం మొక్కలు నాటాం.. వాళ్లు తొలగించిన్రు

by  |
మేం మొక్కలు నాటాం.. వాళ్లు తొలగించిన్రు
X

దిశ, కోదాడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రంలో భాగంగా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్ లో హరితహారం మొక్కలు నాటాలని సూచించడంతో సోమవారం ఖానాపురం పంచాయతీ పరిధిలో డంపింగ్ యార్డ్ లో మొక్కలు నాటారు. కానీ, పక్క గ్రామానికి చెందిన లక్ష్మీపురం గ్రామస్తులు డంపింగ్ యార్డుకు సంబంధించిన భూమి మాది అంటూ నాటిన మొక్కలను తొలగించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఖానాపురం గ్రామ సర్పంచ్ జొన్నలగడ్డ శ్రీనివాసరావు, ఎంపీటీసీ గింజుపల్లి రమేష్ లు.. అధికారులను ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఖానాపురం గ్రామపంచాయతీకి ప్రభుత్వం కేటాయించిన సర్వేనెంబర్ 50 లో 3 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమిలో డంపింగ్ యార్డ్ నిర్మాణం ఏర్పాటు చేశామని, రెవెన్యూ అధికారులు సూచనల మేరకే అక్కడ డంపింగ్ యార్డ్ పనులు జరుపుతున్నామని వారు తెలిపారు. లక్ష్మీపురం గ్రామస్తులు ఇది మాకు సంబంధించిన భూమి అని గ్రామపంచాయతీతో వాదనకు దిగుతున్నారని, ఒకవేళ భూమి వారిదే అయి ఉంటే వారు రెవెన్యూ దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యను పరిష్కరించుకోవాలి.. కానీ, మొక్కలను తొలగించడం అనేది చట్టరీత్యా నేరమని, తినే గ్రామ పంచాయతీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మొక్కలు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.



Next Story

Most Viewed