ట్రెండింగ్‌లో విజయ్ ‘కుట్టి స్టోరీ’

15

దిశ, వెబ్‌డెస్క్: ఇళయ దళపతి విజయ్ రికార్డ్స్ క్రియేట్ చేయడంలో ముందుంటే, విజయ్ ఫ్యాన్స్ ఆ రికార్డ్స్‌ను ట్రెండింగ్‌లో ఉంచడంలో ముందుంటారు. లోకేష్ కనకరాజు డైరెక్షన్‌లో వస్తున్న విజయ్ లేటెస్ట్ మూవీ ‘మాస్టర్’ సినిమా కోసం అభిమానులు ఇప్పటికే చాలా వెయిట్ చేస్తున్నా, దానికి ముహూర్తం ఎప్పుడు కుదురుతుందనేది ఇంకా తెలియదు. కానీ ఇప్పటికే విడుదలైన సాంగ్స్ మాత్రం ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చాయి. కనీసం వాటితోనైనా శాటిస్‌ఫై అవుతున్నారు. అవ్వడమే కాదు తమ అభిమానంతో రికార్డులు కూడా క్రియేట్ చేస్తున్నారు.

అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్షన్‌లో విజయ్ స్వయంగా పాడిన ‘కుట్టి స్టోరీ’ పాట యూట్యూబ్‌లో రికార్డ్ సృష్టించింది. ఇప్పటికే 74 మిలియన్ వ్యూస్ సంపాదించిన ఈ పాట 1.8 మిలియన్ లైక్స్‌తో దూసుకుపోతోంది. తన సినిమాలతో ఎప్పటికప్పుడు అభిమానులను ఇన్‌స్పైర్ చేసేందుకు ప్రయత్నించే విజయ్.. ఈ పాటతో మరోసారి ఫ్యాన్స్‌ను మోటివేట్ చేశాడు. ‘లైఫ్ ఈజ్ వెరీ షాట్ నంబా ఆల్వేస్ బీ హ్యాపీ’ అంటూ సాగే ఈ పాట లిరిక్స్ చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలతో క్యాచీగా ఉన్నాయి. లెట్ మి సింగ్ ఏ కుట్టి స్టోరీ అంటూ.. లైఫ్ లెసన్స్ చెప్పిన మాస్టర్ విజయ్, లైఫ్‌ను సీరియస్‌గా తీసుకోకూడదని, చిల్‌గా ఉండాలని సూచించారు.

ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ లైఫ్‌లోనే ఫెయిల్ అయినట్లుగా ఫీల్ అవుతుండటం, సూసైడ్ చేసుకుంటుండటంతో అది తప్పని.. పరీక్ష ఒక్కటే జీవితం కాదు.. చదువు లేకపోయినా లైఫ్‌ను చాలా రకాలుగా లీడ్ చేయొచ్చని కుట్టి స్టోరీ ద్వారా వివరించాడు విజయ్.