అక్టోబర్‌లో నిలిచిపోనున్న ‘విగో వీడియో’ సేవలు

by  |
అక్టోబర్‌లో నిలిచిపోనున్న ‘విగో వీడియో’ సేవలు
X

దిశ, వెబ్‌డెస్క్ :
చైనాకు చెందిన ‘బైట్ డ్యాన్స్’ అనే ఇంటర్నెట్ కంపెనీకు చెందిన ‘విగో వీడియో, విగో లైట్ యాప్స్’ సేవలను ఈ అక్టోబర్‌ చివరి నాటికి ఇండియాలో నిలిపివేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

విగో వీడియో.. అనేది షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్. 15 సెకన్ల నిడివి గల చిన్న చిన్న వీడియోలను ఇందులో పోస్ట్ చేయొచ్చు. పైగా ఇందులో పోస్ట్ చేసే వీడియోకు స్పెషల్ ఎఫెక్ట్స్, స్టిక్కర్స్ యాడ్ చేసుకునే వీలుంది. లో ర్యామ్, లో స్టోరేజీ ఫోన్ల కోసం విగో లైట్ యాప్‌ను కూడా గతంలోనే కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా, విగో యాప్ సేమ్ ‘టిక్‌టాక్’ యాప్‌ను పోలి ఉండటం గమనార్హం. అయితే ఈ కంపెనీని అక్టోబర్ 31న షట్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ఈ యాప్‌కు సంబంధించిన అకౌంట్లను టిక్‌టాక్‌కు మైగ్రేట్ అయ్యేలా టూల్‌ కూడా ప్రొవైడ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే బ్రెజిల్, మిడిల్ ఈస్ట్‌లో కంపెనీని షట్‌డౌన్ చేశామని తెలిపింది. ‘యూజర్లకు తగినంత గడువు ఇస్తున్నామని, వారు తమ కంటెంట్‌ను టిక్‌టాక్‌లో కంటిన్యూ చేయొచ్చని, ప్రస్తుతమున్న కంటెంట్‌ను ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చని తెలిపింది.

కాగా, విగో వీడియో యాప్‌ ఇండియాలో అనుకున్నంత సక్సెస్ కాలేదు. ప్రస్తుతం 4 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉంటున్నారు. అదే టిక్‌టాక్‌లో చూస్తే.. 200 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉండటం విశేషం. ఇక విగో లైట్ యాప్ విషయానికొస్తే.. మంత్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 1.5 మిలియన్లుగా ఉంది.

Next Story

Most Viewed