- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెళ్లికి ముందే ఇద్దరు పిల్లల తల్లి అయిన స్టార్ నటి.. వారే తన కళ్లంటూ ఎమోషనల్ పోస్ట్
దిశ, సినిమా: 2012లో ‘పోదా పోడి’ అనే తమిళ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన వరలక్ష్మి శరత్ పవార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీనియర్ హీరో, నటుడు శరత్ కుమార్ వారసురాలిగా సినీ రంగంలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదట్లో అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మారిపోయి అనేక అద్భుతమైన సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది.
తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటిస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అలాగే పర్సనల్ లైఫ్ లో కూడా సెటిల్ అవ్వాలని డిసైడ్ చేసుకున్న ఈమె ఇటీవలే తన ప్రియుడితో ఘనంగా నిశ్చితార్థం చేసుకుని పెళ్లాడబోతుంది.
అయితే పెళ్లికి ముందే ఈ జంట తమ పిల్లల పుట్టినరోజును జరిపారు. అయితే వీరిద్దరికీ పిల్లలు ఎప్పుడు పుట్టారని అనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే. అవునండి పిల్లలు అంటే వాళ్ళకి పుట్టిన పిల్లలు కాదు తాను ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న రెండు కుక్కపిల్లలు. అయితే ఇటీవలే వీరిద్దరి పుట్టిన రోజును ఒకే రోజు సెలబ్రేట్ చేసింది వరలక్ష్మి. ఈ వేడుకకు తనకు కాబోయే భర్త నికోలాయ్ సచ్ దేవ్ వచ్చి తెగ సందడి చేశారు.
ముఖ్యంగా మార్చి 25వ తేదీ 3 ఏళ్లు పూర్తి చేసుకున్న గుక్కితో పాటు ఏప్రిల్ 2వ తేదీకి ఏడాది పూర్తి చేసుకున్న జారాలతో కేక్ కట్ చేయించారు. అయితే ఆ రెండు కుక్క పిల్లలు అంటే వరలక్ష్మికి చాలా ఇష్టం. ఆ రెండే తన రెండు కళ్లు అని చెప్పుకొచ్చింది క్యూట్ బ్యూటీ. అలాగే ఈ పుట్టిన రోజు వేడుకకు వచ్చిన వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు పెళ్లికి ముందే కలిసి పిల్లల పుట్టిన రోజు జరపడం చాలా సంతోషంగా ఉందంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.