Currency : మలంను కరెన్సీగా మార్చుతున్న టాయిలెట్ సీటు

by Sujitha |
Currency : మలంను కరెన్సీగా మార్చుతున్న టాయిలెట్ సీటు
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా టాయిలెట్ పేరు చెప్పగానే చాలా మంది షిట్ ఫీలింగ్‌తో ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మార్చేస్తారు. ఇదేం డిస్కషన్‌రా బాబు అంటూ అక్కడికే కట్ చేస్తారు. అయితే ఇదే టాయిలెట్ కాస్త టెక్నాలజీ జోడిస్తే మలంను కరెన్సీగా మార్చే క్రియేటర్‌గా మారిపోయిందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. అవును సౌత్ కొరియాకు చెందిన ప్రొఫెసర్ Cho Jae-Weon ఈ రెవల్యూషనరీ టాయిలెట్‌ను సృష్టించగా ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. వేస్ట్ మేనేజ్మెంట్‌ను ఎదుర్కోవడమే కాకుండా క్రిప్టోకరెన్సీ అందిస్తూ ప్రోత్సహిస్తుంది.


కాగా టెక్ టాయిలెట్ మీ రోజువారీ 500 గ్రాముల వ్యర్థాలను 50 లీటర్ల మీథేన్ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ వాయువు 0.5 kWh క్లీన్ ఎనర్జీగా మార్చబడుతుంది. మీ బాత్రూమ్‌ను మినీ పవర్ ప్లాంట్‌గా మారుస్తుంది. తద్వారా గ్రహాన్ని కాలుష్యానికి గురికాకుండా మార్చడమే కాదు మానవ వ్యర్థాలకు బహుమతి అందిస్తుంది. అంటే చేసిన ప్రతి "డిపాజిట్"కు వినియోగదారులకు "Ggool" అందించబడుతుంది. ఇదే డిజిటల్ కరెన్సీకి "షిట్ కాయిన్" అని కూడా పేరుంది. కాగా వ్యాపారంతోపాటు పర్యావరణానికి సహాయం చేస్తున్న ఈ డిజిటల్ కరెన్సీ కాన్సెప్ట్ నెట్టింట ప్రశంసలు అందుకుంటోంది.

Next Story