ఆ విద్యార్థులకు… ఫ్రీ వైఫై ఏర్పాటు

by  |

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో దాదాపు అన్ని కంపెనీలు, ఆఫీసులు మూత వర్క్ ఫ్రమ్ హోమ్‌ చేయిస్తున్న విషయం తెలిసిందే. అంతేగాకుండా ఇటీవల పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులు కూడా ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో ఇంట్లో ఆన్‌లైన్ సమస్య, నెట్ సరిపోతుండా లేదా అని సందేహపడుతున్న క్రమంలో వారికి ఓ రెస్టారెంట్ దగ్గర ఫ్రీ వైఫై లభిస్తుందని తెలిసింది. ఇంకేముంది, అందరూ చక్కగా ఆ రెస్టారెంట్ దగ్గరలో కూర్చుని, అటు పక్కగా వెళ్లే వారికి ఇబ్బంది లేకుండా పక్కన జాగ్రత్తగా తమ హోం వర్క్ చేసుకుంటున్నారు. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది.

కరోనా కారణంగా అమెరికాలో కూడా ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం ఇచ్చిన హోం వర్క్ కూడా ఆన్ లైన్‌లోనే చేయాలి. అలా సాలియన్ సిటీలోని ఎలిమెంటరీ స్కూలు పిల్లలు ఫ్రీ వైఫై కోసం పడిన పాట్లు నెటిజన్లను ఆకర్షించింది. ఓ నెటిజన్ వారిద్దరి ఫొటోను తీసి ఇన్ స్టా గ్రామ్‌లో పెట్టారు. ఆ ఫొటోను, చదువుకోసం పిల్లల ప్రయత్నాన్ని అభినందిస్తూ భారీగా విరాళాలు ఇచ్చారు. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.1.02 కోట్లు విరాళాలు వచ్చాయి.

మరోవైపు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా పరిపాలన విభాగం కూడా స్పందించింది. వెంటనే ఆ విద్యార్థులకు ఫ్రీ వైఫై ఏర్పాటు చేసింది. అలాగే, మిగిలిన విద్యార్థులకు కూడా ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది ఎంతో అవసరం అంటున్నారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story