ఏపీలో పేలిపోనున్న వాహన జరిమానాలు

by  |
ఏపీలో పేలిపోనున్న వాహన జరిమానాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఇటీవల ఆమోదించిన నూతన మోటార్ వాహనాల చట్టం వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే వారికి జరిమానా భారీగా పడనుంది. ఈ చట్టం ప్రకారం హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ.1,035 జరిమానా పడగా.. రెండోసారి పట్టుబడితే రెట్టింపు జరిమానా విధించనున్నారు. ఇక ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే రూ.5,035 జరిమానా.. రెండోసారి పట్టుబడితే రెట్టింపు జరిమానా పడనుంది.

ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 5 వేలు జరిమానా కాగా, ఇదే కేసులో రెండోసారి పట్టుబడితే రూ.10 వేలు జరిమానా పడుతుంది. అధిక వేగంతో వాహనం నడిపితే రూ.1,035 జరిమానా పడగా.. రెడ్ సిగ్నల్ పడిన తర్వాత నిబంధనలు అతిక్రమిస్తే రూ.1,035 జరిమానా., మైనర్లకు వాహనం ఇస్తే రూ. 5,035 జరిమానా, వాహనానికి సరైన ధృవపత్రాలు లేకుంటే రూ. 2వేలు, రెండోసారి పట్టుబడితే రూ. ఐదు వేలు జరిమానా, పర్మిట్ లేని వాహనానికి రూ.10,000, ఓవర్ లోడ్​కు రూ.20,000 జరిమానా విధించనున్నారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు చేయనున్నారు. ఇక అంబులెన్స్, ఫైరింజన్లకు దారి ఇవ్వకపోతే రూ.పదివేలు జరిమానా విధించనున్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయటంతో పాటు నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం మోటారు వాహనాల చట్టానికి సవరణ చేసింది.

Next Story

Most Viewed