సజ్జనార్ సంచలన ఆదేశాలు.. ఇకపై అలా చేస్తే డ్రైవర్లపై కఠిన చర్యలు

by  |
rtc md sajjanar
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్టీసీలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సజ్జనార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బస్సు డ్రైవర్లను హెచ్చరించారు. ఆర్టీసీ బస్సులను రోడ్డు మధ్యలో ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటూ ప్రమాదాలకు కారణమవుతున్నట్టు వస్తున్న ఫిర్యాదులపై సజ్జనార్ స్పందించారు.

ఈ నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై రోడ్డు మధ్యలో బస్సులను ఆపొద్దని ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్డు మధ్యలో బస్సులను ఆపడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమని, ట్రాఫిక్ పోలీసులు కనుక ఫైన్ వేస్తే ఆ మొత్తాన్ని సంబంధిత డ్రైవర్లే భరించాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూల్స్ ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

రోడ్డు మధ్యలో బస్సులను ఆపడం నేరమన్న విషయంలో డ్రైవర్లను అప్రమత్తం చేయాలని, అందుకోసం డిపోల నుంచి రహదారులపైకి వచ్చేముందు డీజిల్ బంకుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. డ్యూటీ చార్టులు ఇచ్చేముందు డ్రైవర్లకు సూపర్‌వైజర్లు ఈ విషయాన్ని వివరించి చెప్పాలని పేర్కొన్నారు. డ్రైవర్లు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే అంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


Next Story

Most Viewed