బాధ్యతలు స్వీకరించిన శ్రీలత.. నెక్కొండ ప్రజలకు కీలక సూచనలు

by  |
SI Vadnala Srilatha
X

దిశ, నెక్కొండ: వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా వడ్నాల శ్రీలత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నెక్కొండలో ఎస్ఐగా విధులు నిర్వహించిన నాగరాజు బదిలీపై వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెక్కొండ ఎస్ఐగా శ్రీలత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ.. మండలంలోని ప్రజలకు ఏవైనా శాంతి భద్రతలకు సంబంధించి సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి పరిష్కారం పొందాలని సూచించారు.


Next Story

Most Viewed