మొబైల్ మెడికల్ వ్యాన్ ద్వారా వ్యాక్సినేషన్

by  |
Vaccination
X

దిశ, తెలంగాణ బ్యూరో: మొబైల్ మెడికల్ వ్యాన్ ద్వారా వృద్ధులకు, వికలాంగులకు వ్యాక్సినేషన్ చేపడుతామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఆదివారం బన్సిలాల్‌పేట్‌లోని వృద్ధాప్య గృహాన్ని సందర్శించి మొబైల్ మెడికల్ వ్యాన్‌లకు పచ్చ జండా ఊపి వ్యాక్సినేషన్ ను ప్రారంభిచారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేకంగా టీకాలు వేయించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని వృద్ధాప్య గృహాల్లో ఉంటున్న వృద్ధులు, వికలాంగులకు టీకాలు వేయడానికి 24 మొబైల్ మెడికల్ వ్యాన్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఈ మొబైల్ యూనిట్‌లో డాక్టర్, ఫార్మసిస్ట్, ఏఎన్‌ఎం ఉంటారని వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా 19 ఉచిత డయాగ్నొస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, మానవ వనరులను బలోపేతం చేయడం, సామర్థ్యం పెంపొందించడం, హై ఎక్స్ పోజర్ గ్రూపులకు టీకాలు వేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం జరుగుతుందని వివరించారు.

అనంతరం కోఠిలోని యూనియన్ (ఆంధ్ర )బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. బ్యాంక్ ఉద్యోగులకు, ఉద్యోగుల కుటుంబ సభ్యులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టారు. వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినందుకు జనరల్ మేనేజర్ కబీర్ భట్టాచార్య ఇతర బ్యాంకు అధికారులను ప్రధాన కార్యదర్శి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed