జగన్‌తో కేసీఆర్‌కు దోస్తానా: ఉత్తమ్

by  |
జగన్‌తో కేసీఆర్‌కు దోస్తానా: ఉత్తమ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. యావత్ ప్రపంచం కరోనాపై పోరాటం చేస్తుంటే కేసీఆర్ బంధువులు ప్రాజెక్టుల్లో 8శాతం కమీషన్లు పొందడానికి బిజీగా ఉన్నారని విమర్శించారు. కాళేశ్వరం, దుమ్ముగూడెం ప్రాజెక్టుల టెండర్లలో సైతం భారీగా అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. దుమ్ముగూడెం మొదటి టెండర్లలో అర్హత పొందలేని ఎల్‌అండ్‌టీ మంగళవారం అర్హత సాధించడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం ఆరునెలలుగా చేపట్టిన పనులపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డితో కేసీఆర్‌కు ఉన్న దోస్తానాను బహిర్గతం చేస్తామన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని, కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు సంసిద్ధంగా ఉందన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యంపై బుధవారం దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ధర్నా నిర్వహించాలని ఆయన పిలుపు నిచ్చారు. సీనియర్ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed