డేటింగ్ యాప్‌లో ప్లాస్మా డోనర్.. ట్విట్టర్ పోస్ట్ వైరల్

by  |
డేటింగ్ యాప్‌లో ప్లాస్మా డోనర్.. ట్విట్టర్ పోస్ట్ వైరల్
X

దిశ, ఫీచర్స్ : ప్రజెంట్ ఇండియాలో ఆక్సిజన్ సిలిండర్లు, ప్లాస్మా, యాంటీ వైరల్ డ్రగ్స్, హాస్పిటల్ బెడ్స్‌తో పాటు కరోనాతో ఫైట్ చేసేందుకు కావాల్సిన ఇతర ఇంపార్టెంట్ రిసోర్సెస్ కొరత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో ట్విట్టర్ యూజర్ సోహిని చటోపాధ్యాయ్ చేసిన పోస్ట్ వైరల్ అయింది. తన 30 ఏళ్ల ఫ్రెండ్‌కు కొవిడ్ పాజిటివ్ రాగా ప్లాస్మా కోసం పలు ఆస్పత్రులు, హెల్ప్ లైన్ నెంబర్స్‌ను సంప్రదించింది. పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ విషయంలో హెల్ప్ కోరింది. కానీ ఎక్కడి నుంచి సహాయం అందలేదు. అయితే డేటింగ్ యాప్‌ టిండర్‌లో నార్మల్‌గా స్క్రోల్ చేస్తున్న తాను అనుకోకుండా ప్లాస్మా డోనర్‌ను కనుగొన్నానని తెలిపింది.

గతంలో కొవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి దీని గురించి తన బయోలో మెన్షన్ చేశాడని తెలిపింది. దీంతో తనను కాంటాక్ట్ అయ్యానని, హార్డ్ సిచ్యువేషన్స్‌లో ఒక మంచి పని జరిగిందని పేర్కొంది. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా ఇష్యూ వైరల్ అయింది. మైక్రోబ్లాక్ ప్లాట్‌ఫామ్‌లో వైరల్ అయిన ఈ ట్వీట్‌కు గంటలోనే 15 వేల లైక్స్, 1879 రీట్వీట్స్ రాగా, కొందరు నెటిజన్లు మాత్రం తనను ట్రోల్ చేస్తున్నారు. ఫ్రెండ్..ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఉంటే టిండర్ యూజ్ చేస్తున్నావా? అంటూ ఫైర్ అయ్యారు.



Next Story

Most Viewed