కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి వంశీచంద్ రెడ్డిని గెలిపించాలి : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

by Disha Web Desk 23 |
కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి వంశీచంద్ రెడ్డిని గెలిపించాలి : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, హన్వాడ : మనకు మంచి రోజులు వచ్చాయని, మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం హన్వాడ మండలంలోని గొండ్యాల, కిష్టంపల్లి, లింగన్న పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశీర్వదించి, గొప్ప విజయాన్ని ఇచ్చారని, అలాగే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే కానీ, గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు ఎవరికి రాలేదని, అదే రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరువందల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని, ఇప్పటికే ఇంకా ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పథకానికి 400 రూపాయలు వస్తాయి అని ఆయన అన్నారు. మూడు నెలల లోపే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు.

గత పది సంవత్సరాల మోడీ పాలనలో మహబూబ్ నగర్ కు చేసిన మేలు ఏమి లేదని, సిలిండర్, పెట్రోల్ ధరను విపరీతంగా పెంచిందని పేదవాడి ని ఇంకా పేదరికం లోకి నెట్టి వేశారని ఆయన మండిపడ్డారు. మీకోసం కష్ట పడితే మాకు సంతోషంగా ఉంటుందని, అందుకే రైతుల రుణమాఫీ పంద్రాగస్టు లోగా పూర్తి చేస్తామని అన్నారు, మోది పాలనలో పేదవాడి ఆర్థిక పరిస్థితిని దిగజార్చడం తప్ప చేసింది ఏమీ లేదు అని ఆరోపించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోడీ నిరుద్యోగులను మోసం చేశారని జన్ ధన్ ద్వారా నల్లధనం తెచ్చి పేదల ఖాతాలో 15 లక్షలు వేస్తా అని మోసం చేశారని ఆయన అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే లక్ష రూపాయల కనీస వేతనం తో ఉద్యోగాలు వస్తాయని, ప్రతి మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు మహిళలకు అకౌంట్లో వేస్తామని ఆయన తెలిపారు.

నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెండుగా వస్తాయని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కి అండగా నిలవాలని, వంశీచంద్ రెడ్డి ని గెలిపించాల్సిన అవసరమే కాదు అది మన బాధ్యత అని ఆయన అన్నారు. వంశీచంద్ రెడ్డి గెలుపు ఎంతో అవసరమని, రేవంత్ రెడ్డి బలాన్ని పెంచేందుకు ఈ గెలుపు ఎంతో విలువైనది అని ఆయన స్పష్టం చేశారు. అందుకే పార్టీలకు అతీతంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మారేపల్లి సురేందర్ రెడ్డి, టంకర కృష్ణయ్య, మండల అధ్యక్షుడు మహేందర్, నవనీత, వంకం యాదవరెడ్డి, వెంకటాద్రి, వెంకటయ్య, బసప్ప, నంబి రమేష్, రామకృష్ణ, రాఘవరెడ్డి కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed