ఆఫ్రికన్-అమెరికన్‌ ఆస్ట్రోనాట్‌కు కమలా హ్యారీస్ వీడియో కాల్

by  |
Kamala Harris
X

దిశ, ఫీచర్స్ : ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) లాంగ్ టర్మ్ మిషన్ స్పేస్ క్రాఫ్ట్‌లో ప్రయాణించబోతున్న తొలి ఆఫ్రికన్ అమెరికన్ ఆస్ట్రోనాట్‌ను అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్ అభినందించారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)లో ఆస్ట్రోనాట్‌గా పనిచేస్తున్న విక్టర్ గ్లోవర్.. చారిత్రక మిషన్‌లో భాగంగా స్పేస్ క్రాఫ్ట్‌లో అంతరిక్షానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా విక్టర్‌కు వీడియో కాల్ చేసిన కమలా హ్యారీస్.. ప్రెస్టీజియస్ మిషన్‌లో భాగమవుతున్నందుకు కంగ్రాట్యులేషన్స్ తెలిపారు. కలలు ఎలా సాకారం ఎలా చేసుకోవాలో విక్టర్‌ను చూసి నేర్చుకోవాలని, విక్టర్ యూత్‌కు ఇన్‌స్పిరేషన్ అని కమలా హ్యారీస్ పేర్కొన్నారు.

కాగా. బ్లాక్ హిస్టరీ మంత్(#BlackHistoryMonth) సెలబ్రేషన్స్‌లో భాగంగా అమెరికా ఉపాధ్యక్షురాలు విక్టర్‌తో మాట్లాడిన వీడియోను ‘నాసా’ ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. దీంతో నెటిజన్లు నాసాకు థాంక్స్ చెప్తూ.. ‘యు ఆర్ ది బెస్ట్’ అని కామెంట్లు పెడుతున్నారు. ఇక కమర్షియల్ స్పేస్ క్రాఫ్ట్‌లో అంతరిక్షానికి వెళ్లే తొలి ఆఫ్రికన్-అమెరికన్ విక్టర్.. చాలా కాలం నుంచి నాసాలో స్పేస్ క్రాఫ్ట్స్ అండ్ సిస్టమ్స్ క్రూ మెంబర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంగ్ టర్మ్ మిషన్‌లో తనకు అవకాశం రావడం పట్ల అతడు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అంతరిక్షం నుంచి భూమి ఎలా కనిపిస్తుందో చూసేందుకు తాను ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నట్లు తెలిపాడు.


Next Story