లఖీమ్‌పుర్ ఖేరీ.. పీపీఈల నారీ!

by  |
లఖీమ్‌పుర్ ఖేరీ.. పీపీఈల నారీ!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వచ్చిన నాటి నుంచి పీపీఈ కిట్లు, వెంటిలేటర్ల గురించి చర్చ నడుస్తూనే ఉన్నాయి. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి సరిపడా పీపీఈ కిట్లు (కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే దుస్తులు) ఉన్నాయని రాష్ర్ట ప్రభుత్వం చెబుతోంది. కానీ, క్షేత్రస్థాయిలో అవి అందడం లేదన్నది ఒక ప్రధాన వాదన. కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పీపీఈ కిట్ల ఆవశ్యకత ఎంతగానో ఉంది. అయితే మార్కెట్లో వీటి ధర కూడా చాలా ఎక్కువగా ఉంది. పీపీఈ కిట్ల కొరతకు, వాటి ధరకు కళ్లెం వేస్తూ.. ఉత్తరప్రదేశ్ లోని లఖీమ్ పుర్ ఖేరికి చెందిన మహిళలు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందే పీపీఈ కిట్లు తయారు చేసి ఔరా అనిపించారు. ఈ మహిళల కష్టం వెనుక ఓ ఐఏఎస్ అధికారి ఉన్నారు. ఆయనే అర్వింద్ సింగ్.

ప్రపంచంలో గుర్తింపు పొందిన తయారీ సంస్థలే పీపీఈ కిట్ల నాణ్యతలో వెనకబడ్డాయి. అలాంటిది ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ మారుమూల గ్రామమైన లఖీమ్‌పుర్ ఖేరీకి చెందిన మహిళలు ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్‌తో అందరీ మెప్పు పొందుతున్నారు. ‘నేను ఉంటున్న జిల్లాలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు లేవు. ఈ టైమ్‌లో హెల్త్ వర్కర్స్ అందర్నీ టీమ్‌లుగా విభజించాను. ప్రతి టీమ్‌లో వైద్యులు, నర్సులు, ఫార్మాసిస్ట్ట్స్, అంబులెన్స్ డ్రైవర్స్, ఇలా మొత్తంగా 25 మెంబర్లు ఉంటారు. వాళ్లందరికీ పీపీఈ కిట్ల అవసరం ఉంది. అయితే దేశంలో వీటి డిమాండ్ ఎక్కువగా ఉంది. షార్టెజ్ కూడా ఉంది. మా అదృష్టం ఏంటంటే లాక్ డౌన్ కి ముందుగానే మా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను పీపీఈ లను తయారు చేయాల్సిందిగా చెప్పాం’ అని చీఫ్ డెవలప్మెంట్ అధికారి అర్వింద్ తెలిపారు. ‘‘ మా సెల్ఫ్ హెల్ప్ టీమ్ తో కూర్చుని ఎలా తయారు చేయాలో చర్చించుకున్నాం. క్వాలిటీ, డిజైన్, ప్రాసెస్, వంటి విషయాలపై వారికి అవగాహన కలిగించాను. మేం ఉత్పత్తి చేయబోయే దీనికి ‘ఆపరేషన్ కబచ్’ అని పేరు పెట్టుకున్నాం. రా మెటీరియల్ రాగానే పని ప్రారంభించాం. గాగుల్స్, ఫేస్ షీల్డ్స్, హెడ్ గేర్స్, మాస్క్, గ్లోవ్స్, షూ కవర్స్ ఇలా అన్నింటిపై దృష్టి పెట్టాం. డిజైన్ దగ్గరుంచి చూసుకున్నాను. 20 డిజైన్ల తర్వాత ఫైనల్ డిజైన్ సెలెక్ట్ చేశాం. లక్నో కు చెందిన నార్తర్న్ కమాండ్ ఆర్మీ బేస్ హస్పిటల్ వాళ్లు 2 వేల పీపీఈ కిట్లు ఆర్డర్ చేశారు. లక్నో కంటోన్మెంట్ 52 కిట్లు, కుమవోన్ ఇండోర్ డివిజిన్ 20 కిట్లు, సహస్ర్త సీమాబల్ 30 కిట్లు ఆర్డర్ చేశాయి. వాళ్లందరికీ డెలివరీ కూడా చేశాం. ప్రతి కిట్ కేవలం 490 రూపాయలే. మొత్తంగా 175 మంది మహిళలు వీటి కోసం కష్టపడుతున్నారు. లఖీమ్ పుర్ ఖేరీ, ఇసానగర్, నిగసన్ పాలియా, గోలా, మోహమ్మడి గ్రామాలకు చెందిన మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో పనిచేస్తున్నారు. ’ అని అర్వింద్ పేర్కొన్నారు.

బ్యాచ్ నెంబర్ :

అర్వింద్ సింగ్ 2015 ఐఏఎస్ బ్యాచ్. టెక్నికల్ రీసెర్చర్ గా సౌత్ కొరియా, హాంకాంగ్‌లో పనిచేసిన అనుభయం ఆయన సొంతం. అంతేకాదు ఇతర దేశాల్లో కరోనా వ్యాప్తి చెందుతున్నప్పుడే ఆయన అప్రమత్తమయ్యారు. అందుకే ‘ఆపరేషన్ కబచ్’ అంతగా విజయవంతమైంది.

tags :uttar pradesh, lakhimpur kheri, ias officer arvind singh, ppe kits,corona virus


Next Story