ప్రధాని మోడీతో యూపీ సీఎం యోగి భేటీ

by  |
PM Modi and UP CM Yogi
X

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ శుక్రవారం గంటకుపైగా భేటీ అయ్యారు. అనంతరం, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ గంటన్నరపాటు సమావేశమయ్యారు. యూపీలో కరోనా నియంత్రణకు సంబంధించి యోగి ప్రభుత్వంపై సొంతపార్టీలోనే అసంతృప్తిరాగాలు పెల్లుబికాయి. దీనికితోడు వచ్చే ఏడాది తొలినాళ్లలో అసెంబ్లీ ఎన్నికలుండటంతో బీజేపీ హైకమండ్ అలర్ట్ అయింది. ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఫీడ్‌బ్యాక్ కోసం రాష్ట్రానికి పంపంది.

వారం తర్వాత తాజాగా, యూపీ సీఎం యోగి వరుసగా పార్టీ అధినేతలతో వరుస చర్చలు జరుపుతున్నారు. ఎన్నికలకు ముందు క్యాబినెట్‌లో మార్పులు సంభవించే అవకాశమున్నదని సమాచారం. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన జితిన్ ప్రసాదాకు కీలక పాత్ర ఇవ్వనున్నట్టు తెలిసింది. తద్వారా 13శాతం జనాభాగా ఉన్న బ్రాహ్మణులకు దగ్గరయ్యే వ్యూహమున్నదని తెలిసింది. అయితే, యోగి ఆదిత్యానాథ్ సారథ్యంలోనే ఎన్నికల బరిలో బీజేపీ దిగనున్నట్టు కొన్నివర్గాలు తెలిపాయి.


Next Story

Most Viewed