2024-25 బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

by Disha Web Desk 12 |
2024-25 బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను గురువారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనుంది. ఈ క్రమంలో మధ్యంతర బడ్జెట్ పై కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించి.. 2024 మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. అనంతరం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామాన్ ఈ మధ్యంతర బడ్జెన్‌ను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్నారు. కాగా త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుని బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పేద మధ్యతరగతి వర్గాలకు భారీ ఊరట లభించే అవకాశం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే.. బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా పార్లమెంట్ కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా ఆరో సారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ సారి బడ్జెట్‌ను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

Read More..

మన్మోహన్, అరుణ్ జైట్లీ రికార్డు బ్రేక్ చేసిన నిర్మలా సీతారామన్



Next Story

Most Viewed