హైదరాబాద్ వెళ్తున్న కాంగ్రెస్ నేతలకు ఊహించని షాక్

by  |
హైదరాబాద్ వెళ్తున్న కాంగ్రెస్ నేతలకు ఊహించని షాక్
X

దిశ, పాలేరు: మాజీ ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు కార్యాలయ సిబ్బంది ఫోన్‌లను కూడా ట్యాప్‌ చేస్తున్న మోడీ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు నుంచి చలో రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరేందుకు సిద్ధమైన పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కూసుమంచి మండలంలో జిల్లా నాయకురాలు రామసహయం మాధావిరెడ్డిని ఆమె నివాసంలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కూసుమంచి ట్రైనీ ఎస్సై విజయ్ కుమార్ హౌస్ అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు. అటు తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మండల జడ్పీటీసీ సభ్యులు బెల్లం శ్రీనివాస్‌ని కూడా తిరుమలాయపాలెం మండల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నేలకొండపల్లి కాంగ్రెస్ ముఖ్య నాయకులను ఎస్సై అశోక్ కుమార్ రెడ్డి అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులను ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దారుణమని, రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకుల ఫోన్లు టాప్ చేయడం సిగ్గుమాలిన చర్యని, కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ప్రభుత్వాలకు భయం పట్టుకుందన్నారు. అందుకే అక్రమ అరెస్టులు చేసి ప్రజాస్వామ్య విలువలను కొల్లగొడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో జైల్ బరో కార్యక్రమం కూడా నిర్వహిస్తామన్నారు. ఈ ప్రభుత్వాలు చేస్తున్న అక్రమ అరెస్టులను ప్రజలు చూస్తూనే ఉన్నారని, తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.


Next Story

Most Viewed