ఇందిరాపార్కు వద్ద నిరుద్యోగ దీక్ష.. వేలాదిగా తరలిరండి..

by  |
ఇందిరాపార్కు వద్ద నిరుద్యోగ దీక్ష.. వేలాదిగా తరలిరండి..
X

దిశ, జల్​పల్లి: భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 27వ తేదీన తలపెట్టిన నిరుద్యోగ దీక్షను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు కొలను శంకర్​రెడ్డి పిలుపునిచ్చారు. ఈ దీక్షకు వేలాదిగా తరలిరావాలని ఆయన కోరారు. శుక్రవారం హైదరాబాద్​లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను బాలాపూర్​కు చెందిన బీజేపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్​కు పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ నెల 27వ తేదీన తలపెట్టిన నిరుద్యోగ దీక్షకు వేలాదిగా యువత తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బండిసంజయ్ సూచించినట్లుగా కొలను శంకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రకాశ్, చందు, యదయ్యగౌడ్ తదితరులు ఉన్నారు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channelNext Story