దిగజారిన వినియోగం.. పెరిగిన నిరుద్యోగం

by  |
దిగజారిన వినియోగం.. పెరిగిన నిరుద్యోగం
X

లీకైన ఎన్‌ఎస్‌ఓ సర్వే

దేశంలో నిరుద్యోగం పెరిగిందని ప్రతిపక్షాలు గగ్గొలు పెడుతున్నాయి. అదేమి లేదని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ మాత్రం కొట్టిపారేస్తోంది. కానీ, నిరుద్యోగం, వినియోగం, పొదుపు‌పై నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (ఎన్‌ఎస్‌ఓ), నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్‌ఎస్ఎస్ఓ) చేపట్టే సర్వేలను మాత్రం బయట పెట్టడం లేదు. అయితే, దేశంలో గృహ వినియోగదారుల ఖర్చుపై ఎన్‌ఎస్‌ఓ నిర్వహించిన సర్వే వివరాలు బహిర్గతమైంది. దీని ప్రకారం దేశంలో వినియోగం భారీగా పడిపోయిందని తెలుస్తుంది. ఎప్పుడైతే నిరుద్యోగం పెరిగిపోతుందో అప్పుడే వినియోగం తగ్గుతుందని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు.

దేశంలో కుటుంబాల కొనుగోళ్లు ఎలా ఉన్నాయనే తెలుసుకోవడానికి ప్రతి ఏటా ఎన్‌ఎస్‌ఓ సర్వే చేపడుతుంది. 2016, నవంబర్ 8న నోట్ల రద్దు, 2017, జులై 1న జీఎస్టీని అమలులోకి తీసుకువచ్చిన తర్వాత 2017 జులై – 2018 జూన్ మధ్యలో ఎన్ఎస్ఓ సర్వే చేపట్టింది. ఈ సర్వే ప్రకారం కుటుంబాల నెలవారీ వినియోగం 3.7 శాతం పడిపోయిందని వెల్లడైంది. గత నాలుగు దశాబ్దాల్లో ఈ స్థాయిలో తగ్గడం ఇదే ప్రథమ కావడం గమనార్హం. ప్రపంచ చమురు సంక్షోభం కారణంగా 1972-73 మధ్యకాలంలో కుటుంబాల కొనుగోళ్లు పడిపోయాయి. ఆ తర్వాత ఎప్పుడూ కుటుంబాల వినియోగంలో ఈ స్థాయిలో తగ్గుదల నమోదు కాలేదు. 2011-12లో ఓ కుటుంబం సగటున నెలకు రూ. 1501 ఖర్చు చేయగా, అది 2017-18 మధ్యలో రూ. 1446గా ఉంది.

2017-18 మధ్యకాలంలో గ్రామీణుల వినియోగం 8.8 శాతం తగ్గింది. గత ఏడేండ్లలో ఈ స్థాయిలో తగ్గడం ఇదే ప్రథమం. వ్యవసాయరంగంలో రుగ్మతలు, ఆహార ఉత్పత్తులకు ధర లేకపోవడం, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాభావం నెలకొనడంతో రైతులకు ఆదాయం తగ్గి వినియోగం కూడా తగ్గినట్లు తెలుస్తుంది. మరోవైపు పట్టణ కుటుంబాల వినియోగం 2 శాతం పెరిగింది. గత ఆరేండ్లలో ఈ స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం.

ఎన్‌ఎస్ఓ సర్వే ప్రకారం దేశంలో పొదుపు రేటు కూడా తగ్గింది. 2015-16 మధ్యకాలంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)‌లో 31.1 శాతం ఉన్న పొదుపు, 2017-18 మధ్యకాలంలో 30.5 శాతానికి పడిపోయింది. ఇందులో గృహాల పొదుపు గణనీయంగా పడిపోయింది. 2011-12 మధ్యకాలంలో జీడీపీలో 23.6 శాతంగా ఉన్న పొదుపు 2017-18 మధ్యకాలంలో 17.2 శాతానికి పడిపోయింది. దేశంలో వినియోగం, పొదుపు తగ్గితే అది ప్రత్యక్షంగా జీడీపీపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

ప్రభుత్వ పెట్టుబడే రక్ష
బిశ్వజిత్ దత్, జేఎన్‌యూ ప్రొఫెసర్
నిరుద్యోగం పెరిగిపోయినప్పున వినియోగం తగ్గుతుంది. వినియోగం తగ్గితే వస్తువులకు డిమాండ్ పడిపోతుంది. ఎప్పుడైతే డిమాండు పడిపోతుందో అప్పుడు కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ముందు రావు. అప్పుడు ఉత్పత్తి పడిపోతుంది. ఈ కారణంగా ఉద్యోగులను ఆయా సంస్థలు తగ్గిస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యలో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో 3,50,000 మంది ఉద్యోగాలు పోయాయి. ఇవి దేశంలో డిమాండు తగ్గడానికి నిదర్శనం. ఆర్థిక వ్యవస్థకు ప్రైవేటు రంగం ఊతమిస్తుందనుకోడంఊతమిస్తుందనుకోవడం భ్రమ. మన దేశం ప్రస్తుతం వ్యవస్థీకృత సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ పెట్టుబడి మాత్రమే డిమాండును పెంచుతుంది.


Next Story

Most Viewed