ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా.. ఇద్దరు మృతి

221

దిశ, కరీంనగర్ సిటీ : కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ శివారులో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనంతో ఓవర్ టేక్ చేయబోయి, ఎదురుగా వస్తున్న కారును వేగంగా ఢీకొట్టారు.

దీంతో బైక్ పై నుంచి కింద పడగా తీవ్ర రక్తస్రావం జరిగి ఇరువురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మృతులు వెల్గటూర్ మండలం చేగ్యాం గ్రామానికి చెందిన వారీగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..