ఇద్దరి ప్రాణం తీసిన దోస్తులు..

28

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని చిలకల గూడలో దారుణం జరిగింది. వాహనం కోసం ఇద్దరు స్నేహితుల మధ్య నెలకొన్న గొడవ కాస్త తారా స్థాయికి చేరుకుంది. దీంతో ఇరువురు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన ఫజల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

మరో ఘటనలో..
హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌లో స్నేహితుల మధ్య ఘర్షణ నెలకొంది.దీంతో చాంద్ అనే యువకుడిని తోటి స్నేహితులు తీవ్రంగా కొట్టారు. తీవ్రగాయాలపాలైన చాంద్ అక్కడికక్కడే మృతి చెందాడు.కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.