ఈటలతో ఇద్దరు మాజీ ఎంపీలు సీక్రెట్ మీటింగ్(వీడియో)

by  |
ఈటలతో ఇద్దరు మాజీ ఎంపీలు సీక్రెట్ మీటింగ్(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉపఎన్నిక క్రమంలో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రాజకీయ సమీకరణాలు చకచకా మారిపోతున్నాయి. హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపు లక్ష్యంగా పార్టీలన్నీ వ్యూహలు రచిస్తుండటంతో.. ఆ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీలన్నీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అధికార పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. మిగతా పార్టీలు అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టడంతో.. రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఈ క్రమంలో హుజురాబాద్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాదయాత్రలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, జితేందర్ రెడ్డి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కారులో అరగంటపాటు ఈ ముగ్గురు సీక్రెట్‌గా మాట్లాడుకున్నారు. హుజురాబాద్ ఎన్నిక క్రమంలో ఏం మాట్లాడుకున్నారనేది చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని, ఎప్పుడు చేరతాననేది త్వరలో ప్రకటిస్తానన్నారు. ఈ క్రమంలో ఈటల,జితేందర్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి రహస్యంగా మంతనాలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కారులో జరిగిన ఈ సమావేశంపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి.



Next Story

Most Viewed