- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పెళ్లయిన 12 రోజులకు బయటపడ్డ వధువు నిజ స్వరూపం.. అదేంటో తెలిస్తే షాక్
దిశ, ఫీచర్స్ : ఈ మధ్యకాలంలో చాలామంది మొదటి చూపులోనే ప్రేమలో పడడం, వివాహం చేసుకోవడం చూస్తున్నాం. అలాగే ఓ అబ్బాయి కూడా మొదటి చూపులోనే ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ తరువాత కొద్ది రోజులకే వివాహం కూడా చేసుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ వరుడికి ఉహించని షాక్ తగిలింది. ఈ సంఘటన ఇటీవల ఇండోనేషియా జరిగింది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి ఇంటర్నెట్‌లో యువతితో పరిచయం పెంచుకున్నాడు. కొన్ని రోజులు ఆన్‌లైన్‌లో డేటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత ఇద్దరూ వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకున్నారు. ఇంటర్నెట్ లో పరిచయం అయిన అమ్మాయిని చూడగానే ఆ వ్యక్తి ప్రేమలో పడ్డాడట. ఆ తర్వాత పెళ్లికి ప్రపోజ్ కూడా చేశాడు. అయితే ఆ వ్యక్తి తనకు కాబోయే భార్య గురించి ఏమీ ఆలోచించకుండానే ప్రేమలో మునిగిపోయాడు. అందుకే ఆ నెట్ సుందరిని అనుమానించలేకపోయాడు.
అయితే ఆ నెట్ సుందరి తన పేరు అదిండా కంజ అజ్జహ్రా అని చెప్పింది. ఆమె తన ప్రియుడికి కలిసినప్పుడల్లా హిజాబ్‌లోనే ఉండేది. ఆ వ్యక్తి ఆమె శైలిని చాలా ఇష్టపడ్డాడు. అయితే పెళ్లి తర్వాత కూడా ఆమె ముఖం దాచుకోవడంతో కష్టాలు మొదలయ్యాయి. అంతేకాదు ఆ నెట్ సుందరి అందరిముందూ తడబడుతూ ఉండేది.
కొత్తగా పెళ్లయిన భార్య ప్రవర్తన చూసిన ఆ వ్యక్తి కలత చెందాడు. ఆ తర్వాత అతను విచారించగా అసలు నిజం తెలిసి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఇప్పటి వరకు భార్యగా భావించిన వ్యక్తి నిజానికి అమ్మాయిగా నటించి మోసం చేస్తున్న ఓ అబ్బాయి. దీంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నెట్ సుందరి పై కేసు నమోదు చేశారు. మోసం కేసులో అతనికి నాలుగేళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.