భారత్‌పై మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించిన ట్విట్టర్

by  |
భారత్‌పై మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించిన ట్విట్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా దిగ్గజమైన ట్విట్టర్, భారత ప్రభుత్వం మధ్య గ్యాప్ అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే పలు విషయాల్లో ట్విట్టర్ అత్యుత్సాహం ప్రదర్శించడంతో కేంద్ర ఐటీశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాకుండా.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాకు ట్విట్టర్ పాఠాలు నేర్పుతోందని ధ్వజమెత్తింది. ట్విట్టర్‌ ఉద్దేశ్యపూర్వకంగానే భారత నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఐటీశాఖ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. తాజాగా ట్విట్టర్ మరోసారి భారత్‌పై అత్యుత్సాహం ప్రదర్శించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన లడ్డాఖ్‌ను వేరే దేశంగా చూపించి, మరోసారి బరితెగించిందని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాకుండా… జమ్మూ కశ్మీర్‌ను పాకిస్తాన్‌లో అంతర్భాగంగా చూపించింది. దీంతో సోషల్ మీడియాలో దిగ్గజమైన ట్విట్టర్‌పై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ట్విట్టర్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతోంది.



Next Story

Most Viewed