కరోనా కాలంలో టీవీఎస్ కొత్త డీల్!

by  |
కరోనా కాలంలో టీవీఎస్ కొత్త డీల్!
X

ఒకవైపు దేశమంతా లాక్‌డౌన్, మరోవైపు వ్యాపారాల్లేక కంపెనీల మూలధన వ్యయం తగ్గిపోతుండటం… అన్ని రకాలుగా అనేక కంపెనీలు పొదుపు మంత్రం పఠిస్తుంటే, దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన కంపెనీ టీవీఎస్ తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. శుక్రవారం సాయంత్రం అందించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో 120 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన బ్రిటిష్ బైక్ సంస్థ నార్టన్ మోటార్ సైకిల్స్(యూకె)ను సొంత చేసుకున్నట్టు వెల్లడించింది. ఈ రెండు కంపెనీల ఒప్పందం విలువ రూ. 153 కోట్లని టీవీఎస్ మోటార్స్ ప్రకటించింది. నార్టన్ సంస్థకు చెందిన ఆస్తులు, బ్రాండ్‌లను సొంతం చేసుకున్నామని స్పష్టం చేసింది. ఈ కొత్త డీల్‌తో టీవీఎస్ మోటార్స్ కంపెనీ స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుందని, వినియోగదారుల అంచనాలను అందుకోవడానికి మరింత దగ్గరయ్యామని టీవీఎస్ మోటార్స్ జాయింట్ మేనెజింగ్ డైరెక్టర్ సుదర్శన్ చెప్పారు. అలాగే, ఇన్నేళ్ల చరిత్ర కలిగిన నార్టన్ వ్యాపార ప్రణాళికతో విలక్షణమైన గుర్తింపును నిలుపుకుంటుందని, బ్రిటీష్ వినియోగదారులు, ఉద్యోగులతో కలిసి టీవీఎస్ సంస్థ పనిచేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. నార్టన్ బైక్ కంపెనీ నుంచి వచ్చిన కమాండో 961 కేఫ్ రేసర్, కమాండో 961 స్పోర్ట్స్, వీ4 ఆర్ఆర్ మోడల్స్ బైక్‌ను ఇష్టపడేవారికి విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Tags : Norton Motorcycles, TVS Motors, Norton Motorcycles Holdings, Norton Motorcycles UK, TVS Motor Company



Next Story

Most Viewed