శ్రీచైతన్య, ఆకాష్​ సంస్థలపై క్రిమినల్​ కేసు పెట్టాలి

by  |
శ్రీచైతన్య, ఆకాష్​ సంస్థలపై క్రిమినల్​ కేసు పెట్టాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: నీట్‌లో తప్పుడు ర్యాంకులు ప్రకటించుకుంటున్న శ్రీ చైతన్య, ఆకాష్ లాంటి కార్పొరేట్ సంస్థల పై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరీష్​ గౌడ్​ డిమాండ్​ చేశారు. తల్లిదండ్రులను, విద్యార్థులను తప్పుడు ప్రకటనలతో మోసం చేస్తున్న ఈ విద్యాసంస్థలను రాష్టంలో నిషేధించాలని డిమాండ్​ చేశారు. ఒకే విద్యార్థులు వేర్వేరు విద్యాసంస్థలకు చెందినట్టు ఎలా ప్రకటించుకుంటారని, గతంలోనూ పలు సందర్భాల్లో కార్పొరేట్​ విద్యాసంస్థలు ఈ రకమైన మోసాలకు పాల్పడినా ప్రభుత్వాలు స్పందించలేదని ఆరోపించారు.

ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష ఫీజును తగ్గించాలి.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జరిగే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష సెట్ ఫీజులను తగ్గించాలని టీవీఎస్​ డిమాండ్​ చేసింది. బీసీలు రూ.800, వికలాంగులు రూ.600 చెల్లించాలని నిర్ణయించడం పేదలకు ఆర్థికంగా భారమవుతుందని, కొవిడ్-19 కాలంలో పేద, మధ్య తరగతి విద్యార్థుల కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఫీజును తగ్గించాలని కోరింది. అధిక ఫీజుల నిర్ణయాన్ని పున:సమీక్షించి ఎస్సీ, ఎస్టీలకు రూ. 200, బీసీ విద్యార్థులకు రూ.300, వికలాంగులకు ఉచితంగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది.


Next Story

Most Viewed