ఆదివాసీలు జాగ్రత్త.. ఈసారి మోసపోకండి : తుడుందెబ్బ

by  |
ఆదివాసీలు జాగ్రత్త.. ఈసారి మోసపోకండి : తుడుందెబ్బ
X

దిశ, కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మద్యం షాపుల టెండర్లలో దళారుల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మండల ప్రధాన కార్యదర్శి వజ్జ రవి అన్నారు. కొత్తగూడ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో వజ్జ రవి మాట్లాడుతూ.. వైన్ షాపుల టెండర్ల విషయంలో బినామీ వ్యాపార దళారులను నమ్మి ఆదివాసీలు కులం, ఏజెన్సీ, తదితర ధ్రువీకరణ పత్రాలను ఇవ్వకూడదన్నారు.

మనకు అందాల్సిన రాయితీలు అందకుండా చేస్తూ ఆదివాసీలను ఆర్ధికంగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. గత కొన్ని ఏళ్ల తరబడి అక్రమ సంపాదన కోసం తెగబడిన కొందరు గిరిజనేతరులు ఆదివాసీలను ఉపయోగించుకుంటూ అక్రమ దందా కొనసాగిస్తున్నారని విమర్శించారు. అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతున్న దళారుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో కుంజ నర్సింగరావు, వాసం వెంకన్న, జోగ వెంకటేష్, ఇర్ప సంపత్, తాటి వీరభద్రంలు, సోలం వెంకన్న, సువర్ణపాక వెంకట రత్నం పాల్గొన్నారు.


Next Story

Most Viewed