నాని బర్త్ డే ట్రీట్.. ‘జగది’గా అదరగొట్టిన నేచురల్ స్టార్

75
Tuck Jagadish, Nani

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని పుట్టినరోజును పురస్కరించుకుని ‘టక్ జగదీష్’ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై శివ నిర్వాణ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్ర టీజర్‌ తాజాగా రిలీజైంది. ఈ టీజర్ బ్యాక్ గ్రౌండ్‌లో ప్లే అవుతున్న సాంగ్ హీరోయిజాన్ని హైలెట్ చేస్తుండగా లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. జగది పాత్రలో నాని కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత, ప్రమాదంలో ఉన్న హీరోయిన్‌‌కు దగ్గరై తనను కాపాడుకునే ప్రయత్నాన్ని టీజర్‌లో చూపించగా.. మొత్తానికి ‘టక్ జగదీష్’ టీజర్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేలా ఉంది. సినిమాలో నానికి తండ్రిగా నాజర్, అన్నగా జగపతిబాబు కనిపించనుండగా.. ఐశ్వర్యా రాజేష్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా నటిస్తోంది. మొత్తానికి ‘టక్ జగదీష్’‌తో నాని పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడనే ధీమాకు వచ్చేశారు ఫ్యాన్స్.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..