ఉప్పొంగిన తీగల ఒర్రె.. ఇబ్బందుల్లో గిరిజనులు

by  |

దిశ, బెజ్జూర్: తీగల ఒర్రె ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెజ్జూర్ పెంచికలపేట ప్రధాన రహదారిపై సులుగుపల్లి సమీపంలోని తీగల ఒర్రె.. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉప్పొంగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెజ్జూర్ నుంచి పెంచికలపేట మీదుగా కాగజ్‌నగర్‌కు వెళ్లాలన్నా.. పెంచికలపేట నుంచి తిరిగి రావాలన్నా.. వరద ఉధృతిలో సాహసం చేయడం ప్రమాదకరం అంటూ వాపోతున్నారు. వర్షాకాలంలో వరదలతో ప్రతి ఏడాది తీగల ఒర్రె ఇలాగే ఉప్పొంగడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. 2013లో వరద ఉధృతికి ఏకంగా ఆర్టీసీ బస్సు బోల్తా పడిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా తీగల ఒర్రెపై వంతెన నిర్మించాలని స్థానిక గిరిజనులు.. ప్రజాప్రతినిధులు, అధికారులను కోరుతున్నారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story