VIDEO: నేషనల్ హైవేపై యువకుడు బైక్ స్టంట్స్.. ఏకంగా పడుకుని డ్రైవ్ చేస్తూ!

by Ajay Maddhiboyina |

బైక్ రైడింగ్ మ‌త్తులో ప‌డి యువ‌త ప్రాణాల‌మీద‌కు తెచ్చుకుంటున్నారు. ఎలాంటి సేఫ్టీలు లేకుండా ఫుల్ స్పీడ్ తో స్టంట్స్ చేస్తూ రోడ్డుపైకి వ‌స్తున్నారు. ట్రాఫిక్ ఎక్కువ ఉండే రోడ్ల‌పై సైతం యువ‌కులు

VIDEO: నేషనల్ హైవేపై యువకుడు బైక్ స్టంట్స్.. ఏకంగా పడుకుని డ్రైవ్ చేస్తూ!
X

దిశ, వెబ్ డెస్క్: బైక్ రైడింగ్ మ‌త్తులో ప‌డి యువ‌త ప్రాణాల‌మీద‌కు తెచ్చుకుంటున్నారు. ఎలాంటి సేఫ్టీలు లేకుండా ఫుల్ స్పీడ్ తో స్టంట్స్ చేస్తూ రోడ్డుపైకి వ‌స్తున్నారు. ట్రాఫిక్ ఎక్కువ ఉండే రోడ్ల‌పై సైతం యువ‌కులు స్టంట్స్ చేస్తూ వాళ్లు ప్ర‌మాదంలో ప‌డ‌టమే కాకుండా రోడ్డుపై ప్ర‌యాణించే ఇత‌ర ప్రయాణికుల‌ను సైతం ప్ర‌మాదంలో ప‌డేస్తున్నారు.

తాజాగా ఏపీలోని మంగ‌ళ‌గిరిలో ఓ యువ‌కుడు న‌డీరోడ్డుపై అలాంటి విన్యాసాలే చేశాడు. మంగ‌ళ‌గిరి రూర‌ల్ కాజ చిన‌కాకాని వ‌ద్ద జాతీయ ర‌హ‌దారిపై స్కూటీతో వ‌చ్చిన యువకుడు స్టీరింగ్ ప‌ట్టుకోకుండా ద‌ర్జాగా కొద్దిసేపు ప‌డుకుని న‌డిపాడు. మ‌రికొద్దిసేపు ఫోన్ మాట్లాడుకుంటూ రెండు చేతులు వ‌దిలేసి ఒక‌ప‌క్క‌కు కూర్చుని న‌డిపాడు. వెన‌కాల వ‌స్తున్న ఓ వ్య‌క్తి వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పెట్ట‌డంతో వైర‌ల్ అవుతోంది. దీంతో ఆ యువ‌కుడిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నెటిజ‌న్లు కోరుతున్నారు. VIDEO

Next Story