వారెవ్వా.. ఏం ఐడియా గురూ! బల్బ్‌కు బాటిల్ రైన్ కోట్

by Yella Dhawani Reddy |

మరో వారం రోజుల్లో నైరుతి ఋతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

వారెవ్వా.. ఏం ఐడియా గురూ! బల్బ్‌కు బాటిల్ రైన్ కోట్
X

దిశ, వెబ్ డెస్క్: మరో వారం రోజుల్లో నైరుతి ఋతుపవనాలు (Southwest monsoon) దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. అలాగే, ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అయ్యే ఛాన్సుందని తెలిపింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి. ఇక వర్ష కాలం వచ్చిందంటే విద్యుత్తు అంతరాయం సమస్యలు తప్పవు. దీనికి తోడు ఆరు బయట బల్బులు వర్షానికి తడిచి త్వరగా పాడువుతుంటాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి వర్షంలో బల్బులు తడవకుండా, నిరంతరాయంగా వెలిగేందుకు ఎవరూ ఊహించని హ్యాక్‌ (Hack) చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. రాబోయే వర్ష కాలానికి ఇది భలే ఉపయోగపడుతుందంటూ నెటిజన్లు ఈ వీడియోను వైరల్‌ (Viral) చేస్తున్నారు.

ఒక వ్యక్తి ఇంటి బయట గోడకు ఓ బల్పును ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విద్యుత్‌ బల్బ్‌ నీటిలో తడవకుండా ఉండేందుకు ఆ వ్యక్తి దానికి ఒక ప్లాస్టిక్ బాటిల్‌ తొడిగించాడు. ముందుగా బల్బ్‌ హోల్డర్‌ను బాలిట్ మూతతో పాటు గోడలో నట్-బోల్ట్‌తో అమర్చాడు. అనంతరం బల్బును ఫిక్స్ చేసి బాటిల్‌ను మూతకు బిగించాడు. అయితే, బల్బు నుంచి ఉత్పత్తి అయ్యే వేడి ప్లాస్టిక్ బాటిల్‌పై ప్రభావం చూపుతుందేమో అనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. అయితే, ప్రస్తుత రోజుల్లో అంతా LED లైట్లనే ఉపయోగిస్తున్నారు. ఇవి 100W బల్బు కంటే చాలా తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి అది ప్లాస్టిక్‌ బాక్స్‌పై పెద్దగా ఎలాంటి ప్రభావాన్ని చూపే అవకాశం లేదు.

ఇక ఈ వీడియోకు ఇప్పటి వరకు 95 లక్షలకు పైగా వ్యూస్‌ రెండున్నర లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'భలే ప్లాన్ గురూ.. ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలు' అంటూ కొందరు.. 'ఇలాంటి ట్రిక్స్ ట్రై చేసే ముందు ఖచ్చితంగా ఎలక్ట్రీషియన్ సహాయం తీసుకోండి' అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Next Story