- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: నిబంధనలకు ‘మానవత్వం’ బలి.. అక్క డెడ్‌బాడీని భుజాన వేసుకుని బ్యాంక్‌కు
నిబంధనల పేరుతో బ్యాంక్ అధికారులు చూపిన కఠిన వైఖరిపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: లోకంలో రోజురోజుకూ మానవత్వం కనుమరుగవుతోంది. తోటి మనిషికి ఆపద వస్తే అక్కున చేర్చుకోవాల్సింది పోయి.. నిబంధనలపై పేరుతో కొందరు సాధారణ ప్రజలను పాతరేస్తున్నారు. అయితే, అచ్చం అలాంటి ఘటనపై ప్రస్తుతం ఒడిశా (Odisha)లో జరిగిన ఘటనకు అద్దంపడుతోంది. చనిపోయిన సోదరి దాచుకున్న డబ్బు తీసుకునేందుకు ఓ సోదరుడు బ్యాంకుకు వెళ్లగా చెదు అనుభవం ఎదురైంది.
గుండెల్ని పిండేసే వ్యథ..
ఒడిశాలోని కెందుఝర్ (Keonjhar) జిల్లా మల్లిపోసి (Malliposi) గ్రామానికి చెందిన గును ముండా అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె అవివాహిత కావడంతో, ఆమె బాగోగులన్నీ తమ్ముడు జితు ముండానే చూసుకునేవాడు. సోదరి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న జితుకు, ఆమె అంత్యక్రియలను అతి కష్టంతో నిర్వహించాడు. దీంతో అతడి చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి. అప్పుడే తన సోదరి బ్యాంక్ ఖాతాలో రూ.19,300 ఉన్నాయని గుర్తుకొచ్చింది. ఆ డబ్బుతో చేసిన అప్పులను తీర్చాలని జితు ముండా ఆశపడ్డాడు.
నిబంధనల పేరుతో బాధితుడికి చుక్కలు..
జితు ముండా సోదరి అకౌంట్‌లోని డబ్బును విత్ డ్రా చేసేందుకు స్థానిక ఒడిశా గ్రామ్య బ్యాంకు (Odisha Gramya Bank)కు వెళ్లాడు. దీంతో అక్కడి బ్యాంక్ అధికారులు బాధితుడికి చుక్కలు చూపించారు. ఖాతాకు నామినీ లేరు.. కాబట్టి నగదు ఇవ్వడం కుదరదని చెప్పేశారు. బ్యాంక్ అకౌంట్ ఉన్న వ్యక్తే స్వయంగా రావాలని, ఆమె వేలిముద్ర కావాలని కండీషన్ పెట్టారు. దీంతో జితు ముండా తన సోదరి చనిపోయిందని.. అంత్యక్రియలకు కూడా డబ్బు లేదని.. దయచేసి అర్థం చేసుకోండని వాళ్ల కాళ్లావేళ్లా పడ్డాడు. అయినా బ్యాంక్ అధికారుల మనసు కరగలేదు
సమాధి నుంచి మృతదేహం బయటకు..
డబ్బుల కోసం బ్యాంకు అధికారులు పెట్టిన నిబంధనలతో విసిగిపోయిన జితు, ఇప్పటికే పూడ్చిపెట్టిన తన సోదరి మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసి (Exhumed), మళ్లీ బ్యాంకు వద్దకు తీసుకువచ్చాడు. అధికారుల కళ్లముందే మృతదేహం వేలిముద్ర వేయించి తన డబ్బులు తాను తీసుకుంటానని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ దృశ్యం చూసి బ్యాంకు సిబ్బంది, ఇతర ఖాతాదారులు నోళ్లు వెళ్లబెట్టారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో వైరల్ కావడంతో బ్యాంక్ అధికారుల తీరుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని ఆ డబ్బు అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో జితు ముండా అక్కడి నుంచి వెనుదిరిగాడు.






