- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video: పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ.. యువకుడి ర్యాష్ డ్రైవింగ్!
మన దేశంలో నిత్యం అనేక రోడ్డు ప్రమాదాలు (Road accident) జరుగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: మన దేశంలో నిత్యం అనేక రోడ్డు ప్రమాదాలు (Road accident) జరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పిన పట్టించుకోకుండా మద్యం తాగి వాహనాలు నడపటం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటం వంటి తదితర కారణాలతో అమాయకులు సైతం బలవుతున్నారు. అందుకు కారణం.. ఇలాంటి నేరాలకు చట్టపరంగా పెద్దగా శిక్షలు పడకపోవటంతో వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా నేటి తరం యువత ఆకతాయిలుగా వ్యవహరిస్తూ ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ భయం భక్తి లేకుండా విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
అమ్మాయిని బైక్‌పై (Bike) కూర్చోబెట్టుకొని ఓ యువకుడు స్పీడ్‌గా ర్యాష్ డ్రైవింగ్ (Rash Driving) చేశాడు. వెనకాల కూర్చున్న అమ్మాయి అతడిని వెనక నుంచి బిగ్గరగా పట్టుకుంది. ఇక మనోడు రోడ్డుపై ఆ బైక్‌ను బ్రేక్ డ్యాన్స్ చేయించాడు. ఇలా భయంకరమైన స్పీడ్‌తో వెళ్తుండగా రోడ్డుపై స్కూటీ అడ్డు రావటంతో బైక్ అదుపుకాక ఒక్కసారిగా ఢీ కొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న ఆ ఇద్దరు యువతీయువకులు గాల్లో ఎగిరి కిందపడ్డారు. స్కూటీపై ఉన్న వ్యక్తి కూడా గాయాలపాలయ్యాడు. అయితే, ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందనేది తెలియరాలేదు. కానీ, రోడ్డుపై ఉన్న ఇతర వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలంటే భయంలేదంటూ మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






