చచ్చినా ఆపను.. టాప్ లేచిపోతున్నా బస్సును ఆపని డ్రైవర్ (వీడియో)

by Disha Web Desk |
చచ్చినా ఆపను.. టాప్ లేచిపోతున్నా బస్సును ఆపని డ్రైవర్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆర్టీసీ బస్ అంటేనే సురక్షితం అని భావిస్తారు ప్రయాణికులు. ప్రైవేట్ వాహనాలను ఎక్కకుండా ఈ బస్సుల కోసమే ఎదురు చూసి మరీ ప్రయాణాలు చేస్తుంటారు. ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నా అందులోని ప్రయాణికులను రక్షించడానికి చివరి క్షణం వరకు ప్రయత్నిస్తాడనడంలో అతిశయోక్తి కాదు. అంత నమ్మకం ఆర్టీసీ బస్ అంటే. కానీ ఓ బస్ డ్రైవర్ నిర్వాకం వల్ల ఆ సంస్థ అభాసుపాలయింది. ప్రయాణికులు సైతం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని హహాకారాలు చేయాల్సి వచ్చింది. ఇంతకూ ఏం జరిగిందంటే..

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో వెలుగు చూసిన సంఘటన ఆ ఆర్టీసీలో కలకలం సృష్టించింది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీస్ బస్సు రూఫ్ లేచిపోయింది. అయినా డ్రైవర్ బస్‌ను ఆపకుండా అలాగే ముందుకు నడిపించాడు. దీంతో ఆ రూఫ్ ఊడి మీదపడిపోతుందనే భయంతో అందులోని ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. అయినా డ్రైవర్ బస్ ఆపాకపోవడంతో ఆందోళనకు గురైన ఓ ప్రయాణికుడు అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ అధికారులు బస్‌ను ఆపించి దానిలోని ప్రయాణికులను మరో బస్‌లో గమ్యస్థానానికి చేర్చారు. అనంతరం MSRTC వైస్ చైర్మన్ శేఖర్ ఛన్నే మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని మీడియాతో చెప్పారు.

Next Story