పల్లెంలో డ్యాన్స్ చేస్తున్న కింగ్ కోబ్రాకు ఫ్యామిలీ పూజలు.. అలా చేసినా వదలని పూజారి!(వీడియో)

by Disha Web Desk 8 |
పల్లెంలో డ్యాన్స్ చేస్తున్న కింగ్ కోబ్రాకు ఫ్యామిలీ పూజలు.. అలా చేసినా వదలని పూజారి!(వీడియో)
X

దిశ, ఫీచర్స్ : పాము అంటే చాలా మందికి భయం వేస్తుంటుంది. దాన్ని చూడగానే ఆమడ దూరం పారిపోతుంటారు. ఇంకొంతమంది అయితే పాము పేరు తీయగానే వణికిపోతుంటారు. కానీ కొంత మంది మాత్రం ఏకంగా కింగ్ కోబ్రానే ప్లేట్‌లో ముందు పెట్టుకొని సంతోషంగా పూజ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్ వేయండి.

నాగ దేవతను పూజిస్తాం. కానీ మనం దగ్గరుండి నాగు పాముకు పూజలు చేయం కదా.. పుట్టలో పాలు పోసి దేవతను మొక్కుకుంటాం. కానీ ఇక్కడ ఓ పండితుడు మాత్రం నిజమైన కింగ్ కోబ్రాను ప్లేట్‌లో పెట్టుకొని రుద్రాభిషేకం చేస్తున్నాడు. ఆ పాము పడగ విప్పి పల్లెంలో కూర్చొని ఉంది. అంతే కాకుండా ఆయన పూజ చేస్తూ మంత్రాలు జపిస్తున్న సమయంలో వ్యక్తిపై పాము కాటు వేయడానికి వస్తున్నా.. వారు కొచెం కూడా భయపడకుండా పూజను కంటిన్యూ చేస్తూనే వస్తున్నారు. ఓ దంపతులు ఆ పాముకు పూజ జరిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగ దేవత, మహాదేవుడి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని యూజర్ క్యాప్షన్ ఇస్తూ వీడియోను షేర్ చేశాడు. ఇక దీనిపై నెటిజన్స్ స్పందిస్తూ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు.

మీ ధైర్యానికి సెల్యూట్ చేయాలి. గ్రేట్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తే.. కింగ్ కోబ్రా కాటు వేస్తే నెక్స్ట్ పూజ మీదే అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇంకొంత మంది వామ్మో.. పూజలో కూడా ఇంత పోటీనా.. పల్లెంలో డ్యాన్స్ చేస్తూ.. కాటు వేయడానికి వస్తున్నా తగ్గేదే లేదంటున్నారు కదా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Next Story