- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో గూఢచారి పావురం కలకలం.. అర్థం కాని కోడ్ లాంగ్వేజ్
ఏదైనా ఒక దేశం తమ శత్రు దేశానికి సంబంధించిన అంతర్గత భద్రతా పరమైన విషయాలను తెలుసుకునేందుకు గూఢచర్యం వ్యవస్థను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఏదైనా ఒక దేశం తమ శత్రు దేశానికి సంబంధించిన అంతర్గత భద్రతా పరమైన విషయాలను తెలుసుకునేందుకు గూఢచర్యం వ్యవస్థను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కాలానుగుణంగా అందులోనూ పెను మార్పులు వచ్చేశాయి. ఇప్పుడంతా మైక్రో డ్రోన్ల జమానా నడుస్తోంది. కానీ, కొన్ని దేశాలు మాత్రం తమ శత్రు దేశాల్లోకి పావురాలను పంపుతూ.. ఎవరికీ అర్థం కాని కోడ్ లాంగ్వేజ్‌తో సమాచారాన్ని ఎక్స్‌చేంజ్ చేసుకుంటున్నాయి. అయితే, అచ్చం అలాంటి ఘటనే ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా బోధన్ మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భవానిపేట గ్రామ శివారులో ఆడుకుంటున్న ఓ మైనర్ బాలుడికి నేలపై తచ్చాడుతూ ఓ పావురం కనిపించింది. దీంతో అతడు పావురాన్ని గ్రామంలోకి తీసుకెళ్లాడు. అనంతరం గ్రామస్థులకు చూపించగా.. పావురం ఎడమ కాలుకు ఓ కోడ్‌తో రింగ్ తొడిగి ఉంది. అదేవిధంగా మరో కాలికి BRPA BLY, 04-2303 ట్యాగ్ ఉండటంతో అది గూఢచారుల పావురం అయి ఉంటుందని పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పావురాన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.






