- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గడ్డి యంత్రంలో చిక్కుకొని ముక్కలైన పాము.. తలభాగం బతికే ఉండటంతో ఘోరం
మధ్యప్రదేశ్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇంటిముందు గడ్డి కత్తిరిస్తుండగా.. అందులో చిక్కుకుని పాము ముక్కలైంది. అయితే తలభాగం మాత్రం గడ్డి కత్తిరించిన యువతిని కాటేసింది. మధ్యప్రదేశ్‌లోని మురైనా జిల్లా సబల్‌గఢ్ పట్టణ సమీప గ్రామంలో ఆదివారం పాము కాటేసి భర్తి కుశ్వాహా అనే యువతి మృతిచెందింది. ఇంటి ముందున్న గడ్డిని యంత్రంతో కత్తిరిస్తుండగా ఆ గడ్డిలో పడుకొని ఉన్న పామును అనుకోకుండా కత్తిరించింది. ఈ ఘటనలో గడ్డితోపాటు పాము మూడు ముక్కలైంది.
అయితే పాము తలభాగం యువతిని కాటేసింది. కుటుంబసభ్యులు ముందు నాటువైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించాక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యుడు ధ్రువీకరించారని రామ్‌పుర్ పోలీస్‌స్టేషను ఎస్‌హెచ్‌వో రమంత్ర గుప్తా తెలిపారు.
Next Story






